తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వ వాహనాలనే తనిఖీ చేసిన స్థానికులు! - ట్రాఫిక్ నియమాలు

​​​ట్రాఫిక్​ నిబంధనలన్నీ సాధారణ ప్రజలకేనా? ప్రభుత్వ వాహనాలకు వర్తించవా? అని ప్రశ్నించారు భువనేశ్వర్ ప్రజలు. అందుకే ప్రభుత్వ వాహనాలనే తనిఖీ చేశారు. అందులో చాలా వాహనాలు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చారు. నిరసన ఉద్ధృతంగా మారే సరికి పోలీసులు లాఠీలకు పనిచెప్పి ప్రజలను చెదరగొట్టారు.

ప్రభుత్వ వాహనాలనే తనిఖీ చేసిన స్థానికులు!

By

Published : Sep 7, 2019, 6:39 PM IST

Updated : Sep 29, 2019, 7:23 PM IST

ప్రభుత్వ వాహనాలనే తనిఖీ చేసిన స్థానికులు!
కొత్త మోటారు వాహన చట్టంపై ఒడిశా భువనేశ్వర్‌ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నందున తాజాగా వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అన్ని ప్రభుత్వ వాహనాలను రోడ్లపై ఆపి.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్, రహదారి పర్మిట్లు, రిజిస్ట్రేషన్, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్లు చూపించాలంటూ స్థానికులు బలవంతం చేశారు.

ఈ క్రమంలో కొంతమంది డ్రైవర్లు వాహనాలను వదిలి పరుగులు తీశారు. మరోవైపు రాజ్‌మహల్ చౌక్‌వద్ద ట్రాఫిక్ జరిమానాలకు వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పెద్దసంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపుచేసేందుకు నిరసనకారులపై లాఠీఛార్జి చేశారు.

ఇదీ చూడండి:జాబిల్లిపైకి చేరుకునే ప్రయత్నాల్లో 40 శాతం విఫలమే!

Last Updated : Sep 29, 2019, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details