తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గల్వాన్​ వీరులకు ఫ్రాన్స్​ రక్షణమంత్రి సంఘీభావం - అమర వీరులకు ఫ్రాన్స్​ రక్షణమంత్రి సంఘీభావం

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య భారత్​కు ఫ్రాన్స్​ అండగా నిలిచింది. ఈ మేరకు భారత రక్షమంత్రి రాజ్​నాథ్ సింగ్​కు ఫ్రాన్స్​ రక్షణమంత్రి ఫ్లోరెన్స్​ పార్లె లేఖ రాశారు. గల్వాన్​ లోయలో అమరులైన 20మంది జవాన్లకు సంఘీభావం తెలుపుతూ.. భారత్​కు సహకారం అందించడానికి ఫ్రాన్స్​ సాయుధ దళాలు ఎప్పుడూ సిద్ధమేనని లేఖలో పేర్కొన్నారు పార్లె.

French defence minister condoles death of 20 Indian soldiers in Galwan
అమర వీరులకు ఫ్రాన్స్​ రక్షణమంత్రి సంఘీభావం

By

Published : Jun 30, 2020, 3:50 PM IST

గల్వాన్​ లోయఘర్షణలో అమరులైన 20మంది భారత జవాన్లకు సంఘీభావం తెలుపుతూ.. ఫ్రాన్స్​ రక్షణమంత్రి ఫ్లోరెన్స్​ పార్లె... భారత రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు లేఖ రాశారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఫ్రాన్స్​ దళాల స్నేహపూర్వక సహకారం భారత్​కు ఎప్పడూ ఉంటుందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేసే విధంగా భారత్​లో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నట్టు లేఖలో స్పష్టం చేశారు పార్లె.

"సైనికులు, వారి కుటుంబాలు, భారత దేశానికి ఇది అతి పెద్ద దెబ్బ. అమర వీరుల మరణం పట్ల భారత్​కు ఫ్రాన్స్​ సంఘీభావం తెలుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఫ్రాన్స్​ సాయుధ దళాలతో పాటు నా స్నేహపూర్వక, దృఢమైన సహకారం భారత్​కు ఎప్పుడూ ఉంటుంది."

--- ఫ్రాన్స్​ రక్షణమంత్రి ఫ్లోరెన్స్​ పార్లె లేఖ.

గత కొన్నేళ్లలో ఫ్రాన్స్​- భారత్​ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలోనే.. ఒప్పందంలో భాగంగా వచ్చే నెల 27 నాటికి అత్యాధునిక రఫేల్​ యుద్ధ విమానాలను భారత్​కు అందించనుంది ఫ్రాన్స్​.

చైనాతో సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతున్న తరుణంలో భారత్​కు ఫ్రాన్స్​ అండగా నిలవడం దేశానికి సానుకూల అంశం.

ఇదీ చూడండి:-కరోనాపై భారత్​ పోరుకు ఫ్రాన్స్​ భారీ రుణసాయం

ABOUT THE AUTHOR

...view details