భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా నిఘా వర్గాలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో... ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రక్షణ సంబంధిత పత్రాలు ఉన్నందున రాజీవ్ శర్మను అధికారిక రహస్యాల చట్టం కింద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రాజీవ్‌కు భారీ మొత్తంలో నగదు అందించిన చైనా మహిళ, ఆమె నేపాల్ సహచరుడిని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎల్ఓసీ వద్ద భారత బలగాల మోహరింపు, సరిహద్దుల్లో భారత వ్యూహాలను.. రాజీవ్ చైనా నిఘా వర్గాలకు చేరవేశారని దిల్లీ పోలీసులు తెలిపారు.
"చైనా నిఘా సంస్థలకు సున్నితమైన సమచారాన్ని చేర వేస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌ను ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. షెల్ కంపెనీల ద్వారా అతనికి భారీ మొత్తంలో నగదు అందింది. 2016-18 మధ్య కాలంలో రాజీవ్.. కీలక సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. అతని నుంచి భారీగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. వివిధ దేశాల్లో వారిని కలుసుకునేవాడు."
- సంజీవ్ కుమార్ యాదవ్, డీసీపీ,ప్రత్యేక విభాగం