తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉచిత టీకా హామీ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదు' - ఉచిత కొవిడ్ టీకా హామి

బిహార్​ ఎన్నికల సందర్భంగా భాజపా చేసిన ఉచిత కరోనా టీకా హామీ ఎన్నికల కోడ్​ ఉల్లంఘన కాదని ఈసీ వెల్లడించింది. ఓ సమాచార హక్కు కార్యకర్త ఫిర్యాదుపై ఈసీ ఈ విధంగా స్పందించింది.

EC_BIHAR POLLS
'ఉచిత కరోనా టీకా హామీ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదు'

By

Published : Oct 31, 2020, 2:27 PM IST

కరోనా టీకాను ఉచితంగా అందిస్తామన్న హామీ ఎన్నికల కోడ్​ ఉల్లంఘన కిందకురాదని ఈసీ స్పష్టం చేసింది. బిహార్ ఎన్నికల సందర్భంగా 'ఉచిత కొవిడ్ టీకా' హామీని ఎన్నికల ప్రణాళికలో చేర్చింది భాజపా. అయితే, ఇది పక్షపాతంతో కూడినదిగా పేర్కొంటూ ఓ సమాచార హక్కు కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి:భాజపా 'టీకా' ప్రకటనపై విపక్షాల రగడ

ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. భాజపా చేసిన హామీ.. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి రాదని వెల్లడించింది. మోడల్​ కోడ్​ ఆఫ్​ కండక్ట్​లోని ఎనిమిదో భాగంలో పార్టీల ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన మార్గదర్శకాలున్నాయని పేర్కొంది. ఈ మార్గదర్శాకాల ప్రకారం చూస్తే.. ఉచిత కరోనా టీకా హామీ వాటిని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. సంక్షేమం కోసం ఈ హామీని ప్రణాళికలో చేర్చడం తప్పేమీ కాదని తెలిపింది.

ఇదీ చదవండి:బిహార్ బరి: సీమాంచల్​లో ఆధిపత్యం ఎవరిది?

ABOUT THE AUTHOR

...view details