ముంబయి డోంగ్రీలో భవనం కూలిన ఘటనలో 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు. రోడ్లు ఇరుకుగా ఉండటం వల్ల కాస్త ఇబ్బంది కలుగుతోంది. అయినప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్నారు.
ముంబయి: భవనం కూలిన ఘటనలో 13 మంది మృతి - collapse
ముంబయిలో భవనం కూలిన ఘటనలో 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.
ముంబయిలో కూలిన భవనం.
ఏం జరిగింది..?
డోంగ్రీ ప్రాంతం టాండెల్ వీధిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. దుర్ఘటన సమయంలో భవంతిలో 40-50 మంది ఉన్నట్లు సమాచారం.
Last Updated : Jul 16, 2019, 1:46 PM IST