మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత కైలాశ్ జోషి కన్నుమూశారు. 90 ఏళ్ల జోషి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు భోపాల్లోని ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిన కారణంగా తుదిశ్వాస విడిచారు జోషి.
జోషికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అంతిమ సంస్కారాలు దేవాస్ జిల్లాలోని హత్పిపాల్యాలో సోమవారం నిర్వహిస్తారని సమాచారం.
1929 జులై 14 జన్మించిన జోషిని 'రాజకీయ సాధువు'గా పిలుస్తారు. 1977 నుంచి 78 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, రాజ్యసభ, లోక్సభ సభ్యుడిగా పనిచేశారు.