తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తిపై కేసు

సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేసిన మద్రాసు హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్​ సీఎస్​ కర్ణన్​పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై చర్యలు చేపట్టాలని ఇప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు మద్రాసు హైకోర్టులోని సీనియర్​ న్యాయవాదులు.

Former HC Judge C S Karnan booked for controversial remarks
మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తిపై కేసు

By

Published : Oct 28, 2020, 10:30 AM IST

దేశంలోని న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేసిన మద్రాసు హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సీఎస్​ కర్ణన్​పై ఐపీసీ సెక్షన్​ కింద కేసు నమోదు చేశారు చెన్నై పోలీసులు.

న్యాయమూర్తుల ప్రవర్తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇటీవలే ఓ వీడియోను విడదల చేశారు జస్టిస్​ కర్ణన్​. దీనిపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. మహిళలను అగౌరపరిచే విధంగా జస్టిస్​ కర్ణన్​ ఆరోపణలు చేశారని, ఆయనపై చర్యలు చేపట్టాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డేకు లేఖ రాశారు మద్రాసు హైకోర్టులోని సీనియర్​ న్యాయవాదులు.

జస్టిస్​ కర్ణన్​ గతంలోనూ వివాదాల్లో చిక్కుకున్నారు. కోర్టు ధిక్కరణ, న్యాయప్రక్రియపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 2017లో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు​.

ఇదీ చూడండి:-హాథ్రస్​ ఘటన సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కీలక తీర్పు

ABOUT THE AUTHOR

...view details