ప్రచండ గాలులతో విరుచుకుపడుతున్న ఫొని తుపాను ఒడిశా పూరికి దక్షిణంగా తీరాన్ని పూర్తిగా దాటింది. ప్రచండ గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్రమక్రమంగా తుపాను బలహీనపడనుంది. బాలాసోర్ వద్ద తిరిగి సముద్రంలోకి వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు.. భీకర గాలులు వీస్తున్నాయి. గంజాం జిల్లాలో గంటకు 175 కిమీ వేగంతో గాలులు కల్లోల పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. పూరికి సమీపంలో 200 నుంచి 240 కిమీ వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి.
అనంతరం.. కోల్‌కతాను దాటి తుపాను బంగ్లాదేశ్ వైపు వెళ్లనుంది. ఈ లోగా క్రమంగా తుపాను తీవ్రత బలహీనపడే అవకాశముంది.