కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్లో తొలి దఫా అనుబంధ పద్దును ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 2.35లక్షల కోట్లను అదనంగా ఖర్చు చేసేందుకు సభ అనుమతి కోరారు. ఈ మొత్తంలోని అధిక భాగం(రూ. 1.66లక్షల కోట్లు) కరోనాపై పోరు కోసమే ఉపయోగించనున్నట్లు తెలిపారు.
మొత్తం నిధుల్లో రూ. 40వేల కోట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కోసం ప్రభుత్వం కేటాయించనుంది. మరో రూ. 33,771 కోట్లు.. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, జాతీయ సామాజిక సహాయం లబ్ధిదారులకు ప్రత్యక్షంగా బదిలీ చేయనుంది.
ఇదీ చూడండి:-17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్