కమలేష్ తివారీ హత్యకేసులో ఐదుగురి అరెస్ట్ ఉత్తర్‌ప్రదేశ్‌లో హిందూ సమాజ్ పార్టీ అధినేత కమలేశ్ తివారీ హత్య కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందులో ముగ్గురు గుజరాత్‌లోని సూరత్‌లో పట్టుబడ్డారు.
"సూరత్‌లో దొరికిన మోసీన్ షేక్, ఫైజాన్, రషీద్ అహ్మద్‌లను అదుపులోకి తీసుకున్నాం. అయితే ఈ కేసులో ఎలాంటి ఉగ్రకోణం లేదు. వీరిని ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా విచారిస్తున్నారు. ఈ హత్యకు 2015లో తివారీ చేసిన వివాదస్పద ప్రకటనే కారణం అయ్యుండొచ్చు."
-ఓపీ సింగ్, యూపీ డీజీపీ
లఖ్‌నవూలోని తన ఇంటి సమీపంలో ఉన్న కార్యాలయంలో కూర్చుని ఉన్న కమలేష్‌ను శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు హత్య చేసి పరారయ్యారు. వారు కమలేష్‌కు బాగా తెలిసిన వ్యక్తులే అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారు తమ ఆయుధాలను స్వీట్ బాక్స్‌లో పెట్టి తీసుకుని వచ్చారని స్థానికులు చెబుతున్నారు.
2014, 2015లో ముస్లింలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు తివారీ. అప్పటి నుంచి ఆయనకు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. భద్రతా సిబ్బంది కింద అంతస్తులో ఉన్న సమయంలో, తివారీ మొదటి అంతస్తులో ఉండగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.