నూతనంగా ఏర్పాటుకానున్న 17వ లోక్సభ తొలి విడత సమావేశాల తేదీలను మే 31న జరిగే కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. జూన్ 6 నుంచి 15 వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి తొలి రోజు ప్రసంగించనున్నారు. లోక్సభ ప్రొటెమ్ స్పీకర్ను ఆ రోజే నియమించనున్నట్లు తెలుస్తోంది.
జూన్ 10న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అంతకుముందే కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. స్పీకర్ ఎన్నిక ముగిశాక ధన్యవాద తీర్మానంలో ప్రధాన మంత్రి నరంద్రే మోదీ మాట్లాడతారు.