తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గడ్డి వల్ల ఇంత నష్టమా!

రూ. 2లక్షల కోట్లు. పొలాల్లో వృథాగా ఉన్న గడ్డిని కాల్చడం వల్ల భారత్​ ఏటా నష్టపోతున్న సొమ్ము. ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. వాయుకాలుష్యం మిగుల్చుతున్న నష్టాలపై ఓ అధ్యయనంలో తేలిన వాస్తవం.

గడ్డి

By

Published : Mar 4, 2019, 2:56 PM IST

Updated : Mar 4, 2019, 8:06 PM IST

కాలుష్యానికి అడ్డాగా దిల్లీ

"కాలుష్య కోరల్లో దిల్లీ".... తరచూ వినిపించే వార్త. ఇందుకు ప్రధాన కారణం... పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడమే.

పొలాల్లో వృథాగా పడి ఉన్న గడ్డిని కాల్చడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులతో జనం ఎలా ఇబ్బంది పడుతున్నారో దిల్లీని చూస్తే అర్థమవుతుంది. గడ్డిని కాల్చడం వల్ల జరిగే వాయుకాలుష్యం... ఆరోగ్యపరంగానే కాక ఆర్థికంగానూ తీవ్ర నష్టం మిగుల్చుతోంది. ఈ నష్టం విలువ భారత్​లో ఏడాదికి 300కోట్ల డాలర్లని తేల్చింది అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ-ఐఎఫ్​పీఆర్​ఐ.

పరిశోధన కోసం ఉపగ్రహ సమాచారాన్నీ సేకరించింది ఐఎఫ్​పీఆర్​ఐ.

మొదటిసారి ఆరోగ్యానికి-ఆర్థిక రంగానికి లంకె:

ఆరోగ్యానికి-ఆర్థిక అభివృద్ధికి ముడిపెడుతూ జరిగిన మొదటి పరిశోధన ఇది. దిల్లీ, పంజాబ్​, హరియాణాలో గాలి కాలుష్యం, నమోదవుతున్న శ్వాసకోశ సంబంధ రోగాలు, వాటి చికిత్సకు అవుతున్న ఖర్చులు, ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఐఎఫ్​పీఆర్​ఐ ఈ పరిశోధనలు నిర్వహించింది.

పొలాల్లో వృథాగా పడి ఉన్న గడ్డిని కాల్చడం వల్ల లెక్కలేనంత కాలుష్యం జరుగుతోంది. ముఖ్యంగా పంజాబ్​, హరియాణలోని రైతులు భారీగా ఎండుగడ్డి కాల్చుతున్నారు. అందుకే ఇతర ప్రాంతాలతో పోల్చితే దిల్లీలో వాయు కాలుష్యం అధికంగా ఉంది. ఇలా గడ్డి కాల్చడం వల్ల వైద్య ఖర్చులు, ఇతరాలు కలుపుకొని సంవత్సరానికి 2 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయి- ఆహార విధాన పరిశోధనా సంస్థ, అమెరికా

దిల్లీ, పంజాబ్​, హరియాణాలో 2లక్షల 50వేల మంది శ్వాశ సంబంధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిశోధన తెలిపింది.

ఇతర ప్రాంతాలకు విస్తరణ...

వృథా గడ్డిని తగలబెట్టడం గతంలో ఉత్తర భారతంలో మాత్రమే జరిగేది. కానీ ఆధునిక వ్యవసాయ పద్ధతులు వచ్చాక ఇది దేశం మొత్తం పాకుతోంది.

ఇతర కారణాలు:

శ్వాస సంబంధ రోగాలుకు ప్రధాన కారణం గడ్డి కాల్చడం కాగా... దీపావళి టపాసులు, వాహనాల కాలుష్యం కొంత మేర ప్రభావం చూపుతున్నాయని ఆహార విధాన పరిశోధన సంస్థ తెలిపింది. దీపావళి బాణాసంచా కాల్చడం వల్ల సంవత్సరానికి దాదాపు రూ.50 వేల కోట్లు వృథా అవుతున్నట్లు లెక్కగట్టింది.

Last Updated : Mar 4, 2019, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details