తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద కాల్పుల జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో భారత్-చైనా దళాలు మూడు నెలలుగా స్టాండ్-ఆఫ్‌లో ఉన్నాయి.
పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన ఉన్న వ్యూహాత్మక ఎత్తును భారత్ ఇటీవల చేజిక్కించుకుంది. దీనితో పాంగాంగ్ దక్షిణ తీరంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చైనా ఇటీవల చేసిన ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. ఈ ఘటన తర్వాత కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.
పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో భారత బలగాలు.. వాస్తవాధీన రేఖను దాటాయని చైనా ఆరోపిస్తోంది. ఈ మేరకు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ నివేదించింది.