ఆగి ఉన్న రైలులో మంటలు అంటుకున్న ఘటన అసోంలోని సిల్చార్ రైల్వే స్టేషన్లో జరిగింది. సిల్చార్-తిరువనంతపురం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలులోని ఓ బోగీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపు మూడు బోగీలకు మంటలు వ్యాపించాయి. అసోం విపత్తు నిర్వహణ దళం ఆధ్వర్యంలో మంటలు ఆర్పేశారు.
రైల్లో మంటలు- ప్రయాణికులు సురక్షితం
అసోంలోని కచార్ జిల్లా సిల్చార్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న సిల్చార్-తిరువనంతపురం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడు బోగీలు కాలి బూడిదయ్యాయి.
రైల్లో మంటలు- ప్రయాణికులు సురక్షితం
అగ్ని కీలల ధాటికి మూడు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఇదీ చూడండి:'ఆ రాష్ట్రాలపై ప్రధానిది సవతి తల్లి ప్రేమ'