సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ 7 రాష్ట్రాల్లోని 51 నియోజవర్గాల్లో జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని 14 లోక్‌సభ స్థానాలకు 182 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లఖ్‌నవూ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేఠి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా భాజపా నేత, కేంద్రమంత్రి స్మృతిఇరానీ బరిలో నిలిచారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ బరిలో ఉన్న రాయ్‌బరేలీలోనూ పోలింగ్ ప్రారంభమైంది.
'సార్వత్రికం' ఐదోదశ పోలింగ్ ప్రారంభం రాజస్థాన్‌లోని 12 ఎంపీ స్థానాలకు 134 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జైపూర్ గ్రామీణం నుంచి భాజపా అభ్యర్థిగా కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఒలింపియన్ కృష్ణ పూనియా పోటీ పడుతున్నారు.
బంగాల్లోని 7 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఐదో విడత పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఏడు స్థానాల్లో 83 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. బంగాల్లో ఎన్నికల సందర్భంగా అల్లర్లు జరుగుతోన్న నేపథ్యంలో ఈసారి భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు.
మధ్యప్రదేశ్‌లో 7లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం110 మంది అభ్యర్థుల
భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. బిహార్‌లో 5 లోక్‌సభ స్థానాల్లో 82 అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఝార్ఖండ్‌లో 4 లోక్‌సభ స్థానాలకు 61 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్రమంగా తరలివస్తున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన రాంచీ, హజారీబాగ్, కొడెర్మ, కుంతీ లోక్‌సభ స్థానాలకు ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ ..సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే జరగనుంది.
జమ్ము కశ్మీర్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ప్రారంభమైంది. లడఖ్, అనంతనాగ్ పార్లమెంటరీ స్థానాల్లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.