తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పాక్​పై ఏ సమయంలోనైనా ఆర్థిక ఆంక్షలు'

అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్) పాకిస్థాన్​పై ఏ సమయంలోనైనా నిషేధం విధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్. తప్పుడు విధాన నిర్ణయాలు, హద్దుమీరిన సైనిక వ్యవస్థతో సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా పాక్ ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు.

'పాక్​పై ఏ సమయంలోనైనా ఆర్థిక ఆంక్షలు'

By

Published : Oct 2, 2019, 6:46 AM IST

Updated : Oct 2, 2019, 8:21 PM IST

'పాక్​పై ఏ సమయంలోనైనా ఆర్థిక ఆంక్షలు'

ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తున్న పాకిస్థాన్​​పై ఆంక్షల కత్తి వేలాడుతోందన్నారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్. అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్) ఏ సమయంలోనైనా పాక్​పై ఆర్థిక ఆంక్షలు విధించవచ్చని వ్యాఖ్యానించారు.

ఆగస్టులో ఎఫ్​ఏటీఎఫ్ ఆసియా పసిఫిక్ విభాగం పాక్​పై ఆంక్షలు విధించింది. భారత్​పై దాడుల అంశమై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రసంస్థలకు నిధుల రాకను అడ్డుకోలేక పోయిందన్న కారణంతో దాయాదిపై నిర్ణయం తీసుకుందీ సంస్థ. అంతర్జాతీయ సంస్థ అయిన ఎఫ్​ఏటీఎఫ్ హవాలా, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక చేయూత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రిస్తుంది.

తప్పుడు విధాన నిర్ణయాలు, హద్దు మీరిన సైనిక వ్యవస్థతో సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా పాక్​ ముందుకు నడుస్తోందని అభిప్రాయపడ్డారు రాజ్​నాథ్.

పాక్ ప్రధాని సొంత విమానం సమకూర్చుకోలేరా?

ఓ అంతర్జాతీయ కార్యక్రమానికి పాక్ ప్రధాని సొంత విమానాన్ని సమకూర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు రాజ్​నాథ్. సౌదీ అరేబియా ప్రభుత్వం అందించిన విమానంలో గతవారం న్యూయార్క్​ నుంచి బయలుదేరిన అనంతరం సాంకేతిక సమస్య తలెత్తి ఇమ్రాన్​ఖాన్​ ఆగిపోయారని గుర్తు చేశారు. మరో వాణిజ్య విమానాన్ని చూసుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: భారత్​ ఫస్ట్: ఎస్​-400 కొనుగోలుపై జయ్​శంకర్

Last Updated : Oct 2, 2019, 8:21 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details