తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆర్టికల్ 370 రద్దు వల్లే సరిహద్దుల్లో ఆందోళన'

జమ్మూకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినందువల్లే... సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతోందని ఫరూక్​ అబ్దుల్లా పేర్కొన్నారు. చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేశారు.

ABDULAH_JK
'ఆర్టికల్ 370 రద్దు వల్లే సరిహద్దుల్లో ఆందోళన'

By

Published : Oct 11, 2020, 11:00 PM IST

ఆర్టికల్‌ 370 రద్దుపై జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్లే సరిహద్దుల వద్ద చైనా దురాక్రమణకు దిగిందని అన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దును చైనా ఎప్పుడూ అంగీకరించలేదని తెలిపిన ఆయన.. ఆ దేశ సహకారంతోనే దాన్ని పునరుద్ధరించగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు.

'ఊయల కూడా ఊగారు'

చైనా అధ్యక్షుడిని ప్రధాని మోదీ.. భారత్‌కు ఆహ్వానించి ఆయనతో కలిసి ఊయల కూడా ఊగారని ఫరూక్‌ అబ్దుల్లా ఘాటు విమర్శ చేశారు. అంతటితో ఆగకుండా చైనా అధ్యక్షుడితో చెన్నైలో భోజనం చేశారని మండిపడ్డారు. గత ఏడాది ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంగీకారయోగ్యం కాదని ఫరూక్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:మద్యం తాగితే మరింత వేగంగా కరోనా!

ABOUT THE AUTHOR

...view details