దిల్లీ-అమృత్సర్ రైల్వే లైన్లపై రెండు రోజులుగా పంజాబ్ రైతులు చేస్తోన్న ధర్నాను బుధవారం విరమించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు కలుగజేసుకున్నందున రైతులు ధర్నా విరమించారని పోలీసులు తెలిపారు. ధర్నాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న 'కిసాన్ మజ్దూర్ సంఘర్ష్' కమిటీ నేతలకు వ్యతిరేకంగా హై కోర్టులో మంగళవారం ఓ పిటిషన్ దాఖలైంది.
దీంతో బుధవారం కోర్టుకు హాజరవ్వాలని కమిటీ నేతలను కోర్టు ఆదేశించింది. కోర్టుకు హాజరయ్యేందుకు రైతు నేతలు హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.