తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులపై గ్రామస్థుల మూకదాడి.. ఒకరు మృతి

మధ్యప్రదేశ్​లో పిల్లల్ని కిడ్నాప్​ చేస్తున్నారనే అనుమానంతో ఆరుగురు రైతులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు బోర్లాయి గ్రామస్థులు. ఈ ఘటనలో ఓ రైతు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

farmers
రైతులుపై దాడి

By

Published : Feb 6, 2020, 3:12 PM IST

Updated : Feb 29, 2020, 10:01 AM IST

మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. ఆరుగురు రైతులను పిల్లల అపహరణ ముఠాగా అనుమానించి వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు బోర్లాయి గ్రామస్థులు. ఈ ఘటనలో ఓ రైతు మృతి చెందాడు.

కిడ్నాపర్లుగా భావించి

కొంత కాలం క్రితం బోర్లాయి గ్రామానికి చెందిన ఐదుగురు కూలీలు ఇండోర్​ గ్రామానికి చెందిన రైతులు వద్ద కూలి పనికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్​గా రూ. 50 వేలు వారి వద్ద నుంచి తీసుకున్నారు. అనంతరం ఆ పనిని జాప్యం చేస్తూ సాకులు చెప్తూ తప్పించుకుని తిరిగారు.

తాజాగా రైతులకి ఫోన్​ చేసి తమ గ్రామానికి వస్తే డబ్బులు తిరిగి చెల్లించేస్తామని తెలిపారు కూలీలు. దీంతో రైతులు తమ సొమ్మును తెచ్చుకోవడం కోసం కారులో బోర్లాయి గ్రామానికి వెళ్లారు. అయితే వీరి మధ్య వాగ్వాదం జరిగింది. రైతులపై కూలీలు రాళ్లు రువ్వారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన రైతులను వెంటాడి మరి తరిమికొట్టారు.

పిల్లలను అపహరణ చేసే ముఠా గ్రామంలోకి ప్రవేశించిందని అరవడం ప్రారంభించారు. ఈ అరుపులు విన్న గ్రామస్థులు నిజమని భావించి... రైతులపై విచక్షణారహితంగా మూకదాడికి పాల్పడ్డారు. రాళ్లతో, కర్రలతో, చేతికి దొరికిన వాటితో తీవ్రంగా కొట్టారు. వారి వాహనానికి నిప్పంటించారు. ఈ ఘటనలో రైతులు తీవ్రంగా గాయపడ్డారు.

రైతులపై గ్రామస్థుల మూకదాడి.. ఒకరు మృతి

సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసి క్షతగాత్రులని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారిలో ఒకరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

"బోర్లాయి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మా వద్ద 50వేల రూపాయలు తీసుకున్నారు. నిన్న ఫోన్​ చేసి డబ్బులు తిరిగి ఇస్తానంటే వారి గ్రామానికి వెళ్లాము. వారు మాపై రాళ్లతో దాడి చేశారు. వెంటనే మేము అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాగే పిల్లలను ఎత్తుకెళ్లిపోయేవారని అరిచారు. అంతలో గ్రామస్థులు మమల్ని ఆపి తీవ్రంగా దాడి చేశారు."

-బాధిత రైతు

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : బారాత్​లో 'లగే రహో కేజ్రీవాల్' గీతానికి చిందులు ​

Last Updated : Feb 29, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details