తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రుణమాఫీ తర్వాతే రైతు ఆత్మహత్యలు పెరిగాయి' - రైతులు

2008లో రూ. 70వేలకోట్ల రుణమాఫీ చేసినప్పటికీ రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాలా. యూపీఏ పాలనలో రుణ మాఫీ ప్రకటించిన అనంతరం చేసిన ఆడిట్​లో ఆత్మహత్యలు పెరిగిన విషయం బయటపడిందన్నారు.

'యూపీఏ జమానాలోనే రైతు ఆత్మహత్యలు పెరిగాయి'

By

Published : Jul 9, 2019, 5:52 PM IST

రైతు రుణమాఫీని రాజకీయ కోణంలో చూడకూడదన్నారు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి పురుషోత్తం​ రూపాలా. యూపీఏ పాలనలో 2008లో చేసిన రూ. 70వేల కోట్ల రుణమాఫీ అనంతరం రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు.

రైతుల ఆత్మహత్యలను నియంత్రించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం చేపట్టిన చర్యలపై లోక్​సభలో గౌరవ సభ్యుడి ప్రశ్నకు సమాధానమిచ్చారు పురుషోత్తం. 2015 పూర్వ గణాంకాలే ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకునే యూపీఏ జమానాలో వ్యాఖ్యానించినట్లు సమాధానమిచ్చారు.

'యూపీఏ జమానాలోనే రైతు ఆత్మహత్యలు పెరిగాయి'

"రుణ మాఫీ చేసినప్పటికీ ఆత్మహత్య ఘటనలు పెరిగాయి. ఇది రికార్డుల్లో ఉంది. రైతుల ఆత్మహత్యలను రాజకీయ కోణంలో చూడకూడదు. ప్రభుత్వం ఆడిట్ చేసిన అనంతరం భయటపడిన అంశం ఏంటంటే... రుణమాఫీ పొందిన వాళ్లు అసలు రైతులే కాదు. 2015 తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న వారి వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. రాష్ట్రాలు ఆ లెక్కలను గణిస్తున్నాయి. ఆత్మహత్యలు పెరిగాయని సభకు తెలపడానికి ఆధారం 2015 ముందు గణాంకాలే."

-పురుషోత్తం రూపాలా, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి

ఇదీ చూడండి: ఆ ఆసుపత్రిలో తిరిగే చేపలు భలే టేస్టీ గురూ!

ABOUT THE AUTHOR

...view details