తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ వివాదం: ఉభయ సభలు రేపటికి వాయిదా - వాయిదా

పశ్చిమ్​ బంగలో తాజాగా నెలకొన్న వివాదంపై ఉభయ సభలు అట్టుడికాయి. ప్రతిపక్షాల నిరనసలతో ఇరు సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

ఉభయ సభలు

By

Published : Feb 4, 2019, 3:44 PM IST

ఉభయ సభలు
సీబీఐ-బంగాల్​ ప్రభుత్వం మధ్య తాజాగా జరిగిన వివాదంతో పార్లమెంట్​ ఉభయ సభల్లో దుమారం చెలరేగింది. సభలు సమావేశమైన కాసేపటికే టీఎంసీ ఎంపీలు, ఇతర విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫలితంగా వాయిదాల పర్వానికి తెరలేచింది. తొలుత లోక్​సభ 12 గంటలకు వాయిదా పడింది. రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్​సభలో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య బంగాల్​ వివాదంపై వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే దురుద్దేశంతో కేంద్రప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్​ ఆరోపించింది. విపక్షాల విమర్శలను హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తిప్పికొట్టారు.

ఇరు వర్గాల మధ్య 30 నిమిషాల పాటు వాడీవేడిగా చర్చ జరుగుతుండగానే సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. ఈ గందరగోళం మధ్య లోక్​సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.

మధ్యాహ్నం ఉభయసభలు తిరిగి ప్రారంభమైన తర్వాత అవే పరిస్థితులు కొనసాగాయి. ఫలితంగా లోక్​సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details