తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈవీఎంలను హోటల్​కు తరలించిన అధికారి - హోటల్​

ఓ ఎన్నికల అధికారి ఈవీఎంలను హోటల్​కు తరలించి పోలీసులకు చిక్కారు. ఐదో విడత పోలింగ్​ రోజున ఈ ఘటన బిహార్​లోని ముజఫర్​పూర్​లో జరిగింది. పోలీసులు ఎన్నికల అధికారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈవీఎంలను హోటల్​లో పెట్టిన ఎన్నికల అధికారి

By

Published : May 7, 2019, 7:09 PM IST

హొటల్​ వద్ద వాగ్వాదం

బిహార్​లో ఈవీఎం యంత్రాలను హోటల్​లో పెట్టిన ఓ ఎన్నికల అధికారిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం ముజఫర్​పూర్​లో చోటుచేసుకుంది. ఆ ఈవీఎంలను ఎన్నికలకు ఉపయోగించలేదని జిల్లా అధికారులుఅనంతరం స్పష్టం చేశారు. ఆ అధికారికి నోటీసులు జారీ చేశారు.

గుర్తించిన మాహాకూటమి నేతలు...

సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా బిహార్​లో సోమవారం పోలింగ్​ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎన్నికల సామాగ్రిని, 6 ఈవీఎంలను సెక్టార్​ మెజిస్ట్రేట్​ అవధేశ్​ కుమార్​ ఓ హోటల్​లోకి తీసుకెళ్లడం స్థానిక మాహాకూటమి నేతలు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రిగ్గింగ్​ చేసి ఎన్​డీఏకు సహకరించడానికే హోటల్​లో ఈవీఎంలను ఉంచారని మహాకూటమి నేతలు ఆరోపించారు.

అవధేశ్​ కుమార్​తో పాటు ఆయనకి సహకరించిన ఐదుగురు పోలీసులపై చర్యలు చేపట్టే అవకాశముందని జిల్లా మెజిస్ట్రేట్​ స్పష్టం చేశారు. ఈవీఎంల దుర్వినియోగం జరిగిందన్న వార్తలను ఖండించారు. హోటల్​లో పెట్టిన ఈవీఎంలు రిజర్వులో ఉంచినవేనని స్పష్టం చేశారు.

నిబంధనల ప్రకారం ఎన్నికల సామాగ్రి, ఈవీఎంలను నిర్దేశించిన పోలింగ్​ కేంద్రంలోనే ఉంచాలి.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియా ప్రధానిపై గుడ్డుతో మహిళ దాడి

ABOUT THE AUTHOR

...view details