తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'100 శాతం నేర రహిత రాజ్యం రాముడికీ సాధ్యం కాదు' - 'శ్రీరాముడైనా 100 శాతం నేర రహిత సమాజాన్ని కల్పించలేడు'

వంద శాతం నేర రహిత సమాజాన్ని కల్పిస్తానని శ్రీరాముడు కూడా భరోసా కల్పించలేడని పేర్కొన్నారు ఉత్తర్​ప్రదేశ్​ పౌరసరఫరాల శాఖ మంత్రి రణ్​వేంద్ర ప్రతాప్​ సింగ్​. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి నేతృత్వంలోని ప్రభుత్వాల్లో నేరస్థులు తప్పించుకోలేరని వెల్లడించారు.

UP minister
'శ్రీరాముడైనా 100 శాతం నేర రహిత సమాజాన్ని కల్పించలేడు'

By

Published : Dec 5, 2019, 11:36 PM IST

Updated : Dec 5, 2019, 11:55 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​ అత్యాచార బాధితురాలికి నిప్పు పెట్టిన ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర​ మంత్రి రణ్​వేంద్ర ప్రతాప్​ సింగ్​. దేవుడైన శ్రీరాముడు కూడా 100 శాతం నేర రహిత సమాజాన్ని కల్పించేందుకు భరోసా ఇవ్వలేడని పేర్కొన్నారు.

అయితే.. నేరానికి పాల్పడిన వారు తప్పించుకోలేరని భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు భాజపా నేత.

రణ్​వేంద్ర ప్రతాప్​ సింగ్​

" సమాజం వంద శాతం నేర రహితంగా ఉంటుందని చెప్పడానికి.. రాముడు కూడా హామీ ఇవ్వగలడని నేను అనుకోను. కానీ.. నేరం జరిగితే కచ్చితంగా అపరాధి జైలుకు వెళతాడు. అతనికి శిక్ష పడుతుంది."

- రణ్​వేంద్ర ప్రతాప్​ సింగ్​, పౌర సరఫరాల శాఖ మంత్రి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో నిందితులకు ఆశ్రయం కల్పించటం, మద్దతు ఇవ్వటం జరగదన్నారు సింగ్​.

ఇదీ చూడండి: దిల్లీ 'సఫ్​దార్​జంగ్​ ఆసుపత్రి'కి ఉన్నావ్​ బాధితురాలు

Last Updated : Dec 5, 2019, 11:55 PM IST

ABOUT THE AUTHOR

...view details