తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​లో 40 లక్షల మందిపై వరదల ప్రభావం! - బిహార్​లో వరద ప్రభావిత ప్రాంతాలు

బిహార్​లో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 7,800 మందిని  సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్​డీఆర్​ఎఫ్​ తెలిపింది. ఈమేరకు సహాయక చర్యలు అందించేందుకు రాష్ట్రంలో 21 బందాలు పనిచేస్తున్నాయని వెల్లడించింది. 40 లక్షల మందికిపైగా వరదల ప్రభావానికి గురయ్యారు. 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

Evacuated over 7,800 people from flood-hit areas of Bihar: NDRF
7,800 మందినిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించాం

By

Published : Jul 30, 2020, 11:37 PM IST

​బిహార్​ను వరదలు ముంచెత్తుతున్నాయి. దాదాపు 40 లక్షల మందికిపైగా వరదలకు ప్రభావితమయ్యారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్​డీఆర్​ఎఫ్​) సహాయక చర్యలు ముమ్మరం చేసిందిం. నీటమునిగిన ప్రాంతాల నుంచి ఇప్పటివరకు సుమారు 7,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎన్​డీఆర్​ఎఫ్​ ప్రతినిధి తెలిపారు. సహాయక చర్యల కోసం 21 బృందాలు రంగంలోకి దిగినట్లు చెప్పారు.

భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న ముంపు ప్రాంతాల నుంచి సుమారు 7,840ల మంది ప్రజలు, 265 పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు తెలిపింది ఎన్​డీఆర్​ఎఫ్​. అంతేకాకుండా వారికి అవసరమైన మేర ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది.

ఆ రాష్ట్రంలో వరద బీభత్సం కారణంగా.. ఇప్పటివరకు 11 మంది మరణించారు. మరో 40లక్షల మంది ప్రభావితమయ్యారు.

ఇదీ చదవండి:వరదలో పురిటి నొప్పులు- పడవలో కాన్పు

ABOUT THE AUTHOR

...view details