రాజస్థాన్‌లో ఈటీవీ భారత్ 'జలచైతన్యం' రాజస్థాన్‌లో నీటి సంరక్షణకు ఈటీవీ భారత్ నడుం బిగించింది. పురాతన సంప్రదాయ నీటి నిల్వ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య వంతులను చేస్తోంది.
ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో ప్రతి నీటి బొట్టును వృథా కాకుండా జాగ్రత్త పడేవారు పూర్వీకులు. సంప్రదాయ పద్ధతులను అనుసరించి చెరువులు, కొలనులు, బావుల ద్వారా తాగు నీటిని సమకూర్చేవారు.అయితే నీటి సంరక్షణలో ప్రస్తుత తరం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో నీటి కొరత పతాక స్థాయికి చేరింది.
అందుకే రాజస్థాన్‌లో సంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించే బాధ్యతను తీసుకుంది ఈటీవీ భారత్. సమాజాన్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సంకల్పించింది. నీటి సమస్యను అధిగమించేందుకు పురాతన పద్ధతుల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తోంది.
రాష్ట్రంలో చెరువులు, బావులను పరిరక్షించాలని గ్రామపంచాయతీ అధికారులకు సూచించారు ఈటీవీ భారత్ ప్రతినిధులు. వందాలాది మంది గ్రామస్థులు వారికున్న వనరులతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నడుం బిగించారు.
" గ్రామాల్లో సంప్రదాయ నీటి వనరులను కాపాడుకోవడానికి ఇప్పటివరకు ఎవరూ చర్యలు చేపట్టలేదు. ఈటీవీ భారత్ చొరవతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన వస్తోంది."
-పాఠశాల విద్యార్థిని
ఈటీవి భారత్ తలపెట్టిన ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వేలాది మంది విద్యార్థులు, గ్రామస్థులు, స్థానిక రాజకీయ నాయకులు, పాలనా అధికారులు సైతం కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.
ఈటీవీ భారత్ ఆలోచనను ఝుంఝున్ జిల్లా కలెక్టర్ రవి జైన్ ప్రశంసించారు. సమాజంలో కలిసి పనిచేయాలనే గొప్ప సందేశాన్ని ప్రజలకు చేరవేసే మాధ్యమంగా ఈటీవీ భారత్‌ను అభివర్ణించారు. ఈ కార్యక్రంలో తానూ భాగస్వామిని అవుతానని తెలిపారు.
"నీటి కొరత సమస్యను అధిగమించేందుకు రాజస్థాన్‌లోని అన్ని జిల్లాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలి. అన్ని గ్రామాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. భావి తరాల భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలి."
-రవి జైన్, జిల్లా కలెక్టర్
ఇదీ చూడండి: 'ప్రజల గుండెల్లో షీలా చిరస్థాయిగా నిలుస్తారు'