తెలంగాణ

telangana

ETV Bharat / bharat

155 విమానాలు రెండు గంటలు ఆలస్యం - ప్రయాణికులు

ఎయిర్​ ఇండియా సర్వర్​ లోపంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమస్య పరిష్కరించినా... ఇంకా అనేక విమానాలపై ప్రభావం పడుతోంది. ఈ రాత్రి ఎనిమిదిన్నర వరకు 155 విమానాలు సగటున రెండు గంటలు ఆలస్యంగా నడుస్తాయని ఎయిర్​ ఇండియా ప్రకటించింది.

ఎయిర్​ ఇండియా సేవలకు 6 గంటలు బ్రేక్​

By

Published : Apr 27, 2019, 9:44 AM IST

Updated : Apr 27, 2019, 1:51 PM IST

ఎయిర్​ ఇండియా సేవలకు అంతరాయం

ప్రపంచవ్యాప్తంగా శనివారం ఉదయం ఎయిర్​ ఇండియా విమాన సేవలకు దాదాపు 6 గంటలపాటు అంతరాయం కలిగింది. ఎస్​ఐటీఏ సర్వర్​ షట్​డౌన్​ అవడం వల్ల ప్రయణికులు బోర్డింగ్​ పాసులు పొందలేకపోయారు.

సర్వర్​ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. తమ అసంతృప్తిని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. దిల్లీ విమానాశ్రంలో బారులు తీరిన ప్రయాణికులు ఆగ్రహంతో పోలిసులతో వాగ్వాదానికి దిగారు.
సర్వర్​లో సాంకేతిక లోపం వల్లే సేవలు నిలిచిపోయాయని ఎయిర్​ ఇండియా తెలిపింది.

"ఈరోజు ఉదయం 3:30- 4:30 వరకు ప్రయాణికుల సర్వీసు వ్యవస్థ సర్వర్​ను నిర్వహణ కోసం షట్​ డౌన్​ చేశాం. అనంతరం సాంకేతిక లోపం వల్ల సర్వర్ నిలిచిపోయింది. 8:45 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సర్వర్​ను పునరుద్ధరించాం. విమానాల సర్వీసులో అంతరాయం కలిగింది. ప్రయాణికులకు ఎదురైన ఇబ్బందులపై చింతిస్తున్నాం. సాయంత్రానికి సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశిస్తున్నాం. ఘటన ప్రభావం రోజంతా ఉండే అవకాశముంది."
--- అశ్విని లొహాని, ఎయిర్​ ఇండియా సీఎండీ

ఈ ఘటనపై స్పందించిన అట్లాంటాకు చెందిన ఎస్​ఐటీఏ ఐటీ సంస్థ... ప్రయాణికుల ఇబ్బందికి చింతిస్తున్నట్టు తెలిపింది. సర్వర్​లో సాంకేతిక లోపంపై దర్యాప్తు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

2018లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా 25 విమాన సేవలకు అంతరాయం కలిగింది.

ఇదీ చూడండి: ఓటు భారతం కోసం విద్యార్థుల 'వందేమాతరం'

Last Updated : Apr 27, 2019, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details