తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక ఓటు.. 39 కిలోమీటర్ల కాలినడక

ఎన్నికల నిర్వహణ ఆషామాషీ కాదు. ఓటింగ్​ నిర్వహించేందుకు ఒక ప్రిసైడింగ్​ అధికారి, పోలింగ్​ అధికారులు, భద్రతా సిబ్బంది, కూలీలు... ఇలా ఓ పెద్ద బృందం అవసరం. ఇంతమంది కలిసి పోలింగ్​ నిర్వహించేందుకు వెళ్లినా... ఒక్క ఓటరే వస్తే?

Ensuring nobody is left out

By

Published : Mar 18, 2019, 6:10 AM IST

అక్కడక్కడా విసిరేసినట్లుండే గ్రామాలు. ఎటుచూసినా కొండలు, గుట్టలు. అతి తక్కువ జనసాంద్రత. రవాణా వ్యవస్థ సరిగా ఉండదు. ఎక్కడికైనా వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిందే. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్​ ప్రదేశ్​లో పరిస్థితి ఇది. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు శాసనసభ, లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:'సీవిజిల్'​​ యాప్​లో పాదరక్షలు

చైనా సరిహద్దులోని హయూలియాంగ్ నియోజకవర్గంలోని మాలోగం గ్రామంలో ఒకే ఒక్క ఓటర్​ ఉన్నారు. ఆమె పేరు... సోకేలా త్యాంగ్​. వయసు 39ఏళ్లు. అమూల్యమైన ఆమె ఓటు కోసం పోలింగ్​ సిబ్బంది ఎంతో కష్టపడతారు. జిల్లా కేంద్రం అంజావ్​ నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి నడిచి వెళ్తారు. ఈ ప్రయాణానికే ఒక రోజు పడుతుంది.

'ఏకైక ఓటరు'

మాలోగం గ్రామంలో సోకేలాతో పాటు మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి. కానీ... ఓటరు మాత్రం ఒక్కరే. కారణం... మిగిలినవారంతా ఇతర పోలింగ్​ కేంద్రాల్లో ఓటు నమోదు చేసుకున్నారు.

2014 ఎన్నికల సమయంలో సోకేలా, ఆమె భర్త జానేలూమ్​ త్యాంగ్​ ఓట్లు మాలోగం పోలింగ్​ స్టేషన్​లో ఉండేవి. భర్త​ ప్రస్తుతం తన పేరును వేరే పోలింగ్​ బూత్​లో నమోదు చేసుకున్నారు. ఇక ఆ గ్రామంలో ఉన్న ఏకైక ఓటరు సోకేలానే.

సోకేలా త్యాంగ్ ఒక్కరే ఉన్న పోలింగ్​ బూత్​కు ఎన్నికల నిర్వహణకు సిబ్బంది అంతా వెళ్లాల్సిందే. ప్రిసైడింగ్​ అధికారి, పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది 39 కిలో మీటర్లు కాలినడకనే వెళ్లాలి. ఎన్నికల రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్​ బూత్​లోనే ఉండాలి.​ సోకేలా త్యాంగ్ ఎప్పుడు వచ్చి ఓటేస్తే అప్పుడే పూర్తవుతుంది. కానీ ఓటరును త్వరగా వచ్చి ఓటేయాలని బలవంత పెట్టరాదు.

అతి తక్కువ ఓటర్లు...

అరుణాచల్​ ప్రదేశ్​లోని కొన్ని పోలింగ్​ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య మరీ తక్కువగా ఉంది. పక్కే కేస్సాంగ్​ అసెంబ్లీ నియోజకవర్గంలోని లమ్టా పోలింగ్​ బూత్​లో ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. 2,202 పోలింగ్​ స్టేషన్లున్న అరుణాచల్​ప్రదేశ్​లో 7 బూత్​లలో ఓటర్ల సంఖ్య 10 కన్నా తక్కువే. 281 స్టేషన్లలో 100లోపు ఓటర్ల ఉన్నారు.

ఇవి మాలోగం కన్నా దూరం...

రాష్ట్రంలో మాలోగం లాంటి గ్రామాలు మరెన్నో ఉన్నాయి. 518 పోలింగ్​ బూత్​లలో 30-50 కిలోమీటర్లు నడిస్తేకానీ పోలింగ్​ సిబ్బంది చేరుకోలేరు. అంటే దాదాపు 3 రోజులు నడవాలన్నమాట!

మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా...

అరుణాచల్​ప్రదేశ్​లో ఏప్రిల్​ 11న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 7.94 లక్షలు. దాదాపు 4 లక్షల మంది మహిళా ఓటర్లు. రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఈసారి ప్రత్యేకంగా 11 పోలింగ్​ స్టేషన్లను మహిళా ఓటర్ల కోసమే ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి:వారసుడి కోసం కన్నయ్యకు కళ్లెం!

ABOUT THE AUTHOR

...view details