ఇంజినీర్స్ డేను పురస్కరించుకొని దేశంలోని ఇంజనీర్లందరికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారుప్రధాని నరేంద్రమోదీ. దేశ వ్యాప్తంగా ఈ రోజున ఇంజినీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులు విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
ఇంజినీర్లు కృషికి, సంకల్పానికి ప్రతిరూపాలు:మోదీ ఇంజినీర్లు.. కృషికి, సంకల్పానికి ప్రతిరూపాలు. వారి వినూత్న ఆలోచన లేకపోతే మానవ పురోగతి అసంపూర్ణంగా ఉంటుంది. అందరికి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.
-నరేంద్రమోదీ భారత ప్రధాని ట్విట్.
దేశానికి విశేష సేవలందించిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి (సెప్టెంబర్ 15) సందర్భంగా ఇంజినీర్స్ డేను జరుపుకుంటారు. నేటి ఆధునిక భారతావనికి ఇంజినీరింగ్ పునాదులు వేసిన వ్యక్తి విశ్వేశ్వరయ్య. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక అంశాలైన ఆనకట్టలు, పరిశ్రమలకు ఊపిరులూదిన గొప్ప దార్శనికుడు. బెంగుళూరుకు సమీపంలోని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం ముద్దనహళ్లిలో 1861 సెప్టెంబర్ 15న జన్మించారు.
ఇదీ చూడండి:5 రాజ్యసభ స్థాయి సంఘాలకు విపక్షాల నేతృత్వం