తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- ఏడుగురు నక్సల్స్​ హతం - నక్సల్స్​

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- ఆరుగురు నక్సల్స్​ హతం

By

Published : Jul 27, 2019, 6:31 PM IST

Updated : Jul 27, 2019, 7:09 PM IST

19:07 July 27

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళా మావోలు ఉన్నారు. 

తిరియా గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా రిజర్వ్‌ గార్డ్‌, ప్రత్యేక కార్యదళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్​లో పాల్గొన్నాయి.

సంఘటనా స్థలం నుంచి నక్సల్స్ మృతదేహాలు, ఒక ఐఎన్​ఎస్​ఏఎస్​ రైఫిల్​, నాలుగు 303 రైఫిల్స్​ సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

18:55 July 27

ఆయుధాలు స్వాధీనం...

ఘటనాస్థలి నుంచి ఒక ఐఎన్​ఎస్​ఏఎస్​ రైఫిల్​, నాలుగు 303 రైఫిల్స్​ సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఏడుగురు నక్సల్స్​ హతమైనట్లు ప్రకటించారు.

18:49 July 27

ఛత్తీస్​గఢ్​ బస్తర్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఏడుగురు నక్సలైట్లు హతమయ్యారు.

18:22 July 27

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- ఆరుగురు నక్సల్స్​ హతం

ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. బస్తర్​లోని అటవీ ప్రాంతంలో ఆరుగురు నక్సలైట్లను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.
 

Last Updated : Jul 27, 2019, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details