ఒడిశాలో మయూర్బంగ్ జిల్లా కరనిజా అటవీ ప్రాంతానికి సమీపంలో గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఏనుగులకు సహజ ఆవాస ప్రాంతం ఈ కరనిజా అడవులు. కానీ గజరాజల సమూహం దారి మళ్లి గిరిజన గ్రామాల వైపు వస్తున్నాయి. ఏనుగుల గుంపు గ్రామాల్లో వీరవిహారం చేస్తూ ఇళ్లు, పంటలను ధ్వంసం చేస్తున్నాయి.
దాడికి ప్రతిదాడి
గిరిజనులు కూడా అడవితల్లిని నమ్ముకుని జీవిస్తుంటారు. ఏనుగుల ఘాతుకానికి తట్టుకోలేక వాటిపై ఈటెలు, బాణాలతో దాడికి దిగారు. అందుకు అవి ప్రతిదాడికి దిగడం వల్ల ప్రాణాలు చేతపట్టుకొని పరుగులు తీశారు.