తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రశాంతంగా 'సార్వత్రిక' పోలింగ్​... - ANDHRA PRADESH

2019 సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు తమ నియోజకవర్గాల్లో ఓటుహక్కును వినియోగించుకుంటున్నరు. ఓటు హక్కును బాధ్యతగా భావించి.. అందరినీ ఓటు వేసేలా ప్రోత్సహిస్తున్నారు.

2019 ఎన్నికలు

By

Published : Apr 11, 2019, 11:01 AM IST

తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ఈసీ.. నియోజకవర్గాల వారీగా పోలింగ్​ శాతాన్ని ప్రకటిస్తోంది.

2019 ఎన్నికలు

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఎన్నికల సంఘం ఓటింగ్​ సాగుతోంది. ఇటీవల మావోలు దాడి చేసిన ఛత్తీస్​గఢ్ దంతెవాడ ప్రాంతంలోనూ ఓటర్లు భారీగా పోలింగ్​ కేంద్రాలకు వస్తున్నారు.

బిహార్​లో రాష్ట్రమంత్రి ప్రేమ్​ కుమార్​ పోలింగ్​ కేంద్రానికి సైకిల్​పై వచ్చి ఓటు వేశారు.

వివిధ రాష్ట్రాల్లో 9 గంటల వరకు నమోదైన ఓటింగ్​ ఈ విధంగా ఉంది. నాగాలాండ్​ పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధికంగా 21 శాతం ఓటింగ్​ నమోదైంది.

రాష్ట్రం పోలింగ్​ శాతం
నాగాలాండ్​ 21
పశ్చిమ్​బంగ 18.12
మిజోరం 17.5
మణిపుర్ 15.6
అరుణాచల్​ప్రదేశ్​ 13.3
తెలంగాణ 10.6
ఛత్తీస్​గఢ్​ 10.2
అసోం 10.2
లక్షద్వీప్​ 9.83
అండమాన్​ అండ్​ నికోబార్​ ఐలాండ్స్​ 5.83

కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ నాగ్​పుర్​ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 220వ పోలింగ్​ బూత్​లో ఓటు వినియోగించుకున్నారు.

కేంద్ర మంత్రులు నితిన్​ గడ్కరీ(నాగ్​పుర్​), కిరణ్​ రిజిజు(అరుణాచల్​ పశ్చిమం), వీకే సింగ్( ఘజియాబాద్​)​, మహేశ్​ శర్మ(గౌతమ్​ బుద్ధ్​ నగర్​), హన్స్​రాజ్​ అహిర్(చంద్రాపుర్​)​, సత్యపాల్​ సింగ్(బాగ్​పత్​) లు తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లోనే భవితవ్యం తేల్చుకోనున్నారు.​

2019 సార్వత్రిక ఎన్నికలు 543 నియోజకవర్గాలకు 7 దశల్లో జరగనున్నాయి. తొలి దశలో 91 స్థానాలకు ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్​ ముగియనుంది. మే 23న ఫలితాలు ప్రకటించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details