తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వృద్ధురాలి సమయస్ఫూర్తితో దక్కిన ప్రాణం - వంతెన

కర్ణాటకలో ఓ వృద్ధురాలు రైలు పట్టాలను దాటేందుకు ప్రయత్నించింది. రైలు ఆమెపైకి దూసుకొచ్చింది. ఆ సమయంలో వృద్ధురాలు చూపిన సమయస్ఫూర్తే ప్రాణాలను కాపాడింది.

సమయస్ఫూర్తితో ప్రాణం దక్కించుకున్న వృద్ధురాలు

By

Published : Sep 3, 2019, 10:25 AM IST

Updated : Sep 29, 2019, 6:32 AM IST

సమయస్ఫూర్తితో ప్రాణం దక్కించుకున్న వృద్ధురాలు

ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ఆందోళనలో ఏం చెయ్యాలో తెలియక ప్రాణాలను కోల్పోతుంటారు. కర్ణాటకలో ఓ వృద్ధురాలు ప్రాణం పోయే పరిస్థితి ఎదురైనా సమయస్ఫూర్తితో చావు అంచులకు వెళ్లి తప్పించుకుంది.

మానీబాయి చందర్​​ అనే వృద్ధురాలు గుల్బర్గా పరిధిలోని తాండాలో నివసిస్తోంది. చితాపూర్​ రైల్వేస్టేషన్​ నుంచి సమీపంలోనే ఉన్న స్వగ్రామానికి వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా.. గూడ్సు రైలు దూసుకొచ్చింది. అంతే ఆమె ఆందోళన చెందకుండా తెలివిని ఉపయోగించింది. రెండు పట్టాల మధ్యలో పడుకొని ప్రాణాలను దక్కించుకుంది. రైలు వెళ్లిపోయిన తర్వాత స్థానికులు వృద్ధురాలిని ప్లాట్​ ఫారం మీదకు తీసుకొచ్చారు. స్వల్పంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:దిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం

Last Updated : Sep 29, 2019, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details