కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ గతంలో జారీ చేసిన సమన్లను ఎదిరిస్తూ.. శివకుమార్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నేత వ్యాజ్యాన్ని గురువారం విచారించిన కోర్టు.. ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఈడీ విచారణకు హాజరవనున్న డీకే శివకుమార్ - ED
కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు దిల్లీలోని తమ కార్యాలయానికి హాజరవాలని నోటీసులు పంపింది.
శివకుమార్‌కు ఈడీ సమన్లు.. మరికాసేపట్లో విచారణ
ఈ నేపథ్యంలో మరోసారి శివకుమార్‌కు సమన్లు జారీ చేసింది ఈడీ. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు దిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా తాజాగా నోటీసులు పంపింది. ఇదే విషయాన్ని ధ్రువీకరించిన శివకుమార్ దిల్లీకి బయలుదేరారు. "ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దురుద్దేశంతో సమన్లు జారీ చేసినప్పటికీ.. చట్టంపై ఉన్న నమ్మకంతో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని" చెప్పారు శివకుమార్.
Last Updated : Sep 28, 2019, 8:34 PM IST