తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోల్డ్ స్మగ్లింగ్​ నిందితులపై మనీలాండరింగ్ కేసు

ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)... కేరళ బంగారం అక్రమ రవాణా కేసు నిందితులపై మనీలాండరింగ్ అభియోగాలు నమోదు చేసింది. నిందుతులను ప్రశ్నించడానికి సమాయత్తమవుతోంది.

ED registers money laundering complaint in Kerala gold smuggling case
కేరళ గోల్డ్ స్మగ్లింగ్​ నిందితులపై ఈడీ మనీలాండరింగ్ కేసు

By

Published : Jul 22, 2020, 6:38 PM IST

దేశంలో సంచలనం సృష్టించిన కేరళ బంగారం అక్రమ రవాణా కేసు విచారణ మరింత వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ వ్యవహారంపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై 'ఎన్​ఐఏ' నమోదు చేసిన అభియోగాలను పరిశీలించిన ఈడీ... ఎఫ్​ఐఆర్​కు సమానమైన... ఎన్​ఫోర్స్​మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్​ రిపోర్టు (ఈసీఐఆర్​) నమోదు చేసింది. నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. అవసరమైతే నిందితులకు చెందిన స్థిర, చరాస్తులను కూడా స్తంభింపజేసేందుకు ఈడీకి అధికారం ఉంది.

బడా స్మగ్లింగ్​

జులై 5న గల్ఫ్​ నుంచి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన కార్గో నుంచి సుమారు రూ.15 కోట్లు విలువ చేసే 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ స్మగ్లింగ్ కేసులో నలుగురి పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితులు సరిత్​, స్వప్నా సురేష్​, సందీప్ నయ్యర్​, ఫాజిల్ ఫరీద్​ను అరెస్టు చేసి విచారించారు. ఇప్పటికే ఈ కేసుపై కస్టమ్స్​, ఎన్​ఐఏ, ఆదాయ పన్నుశాఖలు దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఈడీ కూడా విచారణ ప్రారంభించింది.

ఇదీ చూడండి:గ్యాంగ్​స్టర్ దుబే ఎన్​కౌంటర్​పై దర్యాప్తు షురూ!

ABOUT THE AUTHOR

...view details