తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మొదట బదిలీ.. నిమిషాల్లోనే పునర్నియామకం - బదిలీ

వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న నీరవ్​ మోదీ కేసును విచారిస్తోన్న అధికారిని ఈడీ బదిలీ చేయటం వివాదాస్పదమైంది. బదిలీ ఉత్తర్వులను నిమిషాల్లోనే రద్దు చేసింది ఈడీ.

నీరవ్​ మోదీ

By

Published : Mar 30, 2019, 6:42 AM IST

Updated : Mar 30, 2019, 7:12 AM IST

మొదట బదిలీ.. నిమిషాల్లోనే పునర్నియామకం
పంజాబ్​ నేషనల్​ బ్యాంకు రుణ ఎగవేత కేసులో ప్రధాన నిందితుడు నీరవ్​ మోదీ కేసును విచారిస్తోన్న ముఖ్య అధికారిని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ బదిలీ చేయటం వివాదాస్పదమైంది.

నీరవ్​ మోదీ కేసును విచారిస్తోన్న ముంబయి జోన్​ జాయింట్​ డైరక్టర్​ సత్యబ్రత్​ కుమార్​ను బదిలీ చేస్తున్నట్లు పశ్చిమ జోన్​ ప్రత్యేక డైరక్టర్​ వినీత్​ అగర్వాల్​ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం నీరవ్​ మోదీ బెయిల్​ విచారణ నిమిత్తం సత్యబ్రత్​ కుమార్​ లండన్​లోనే ఉండటం గమనార్హం.

బదిలీ వార్త బయటకు రాగానే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ఈడీ డైరక్టర్​ సంజయ్​ మిశ్రా కుమార్​ స్పందించారు. వెంటనే బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు.

ఇదీ చూడండి :మాల్యా, నీరవ్​ కేసుల్లో నేడు కీలక నిర్ణయాలు!

ఎందుకు..?

విచారణ అధికారిని 5 సంవత్సరాలకు మించి కొనసాగించకూడదని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​లో నిబంధన ఉంది. కుమార్​ 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది. ప్రధాన కార్యాలయం నుంచి ఆయన కొనసాగింపుపై ఎటువంటి ఆదేశాలు అందలేదు. దీంతో కుమార్​ని తప్పించి అగర్వాల్​ అనే మరో అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఇది సాంకేతిక కారణమేనని ఈడీ తెలిపింది.

ఈడీ డైరక్టర్​ సంజయ్​ మిశ్రా కుమార్​ ఈ బదిలీని రద్దు చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. సత్యబ్రత్​ కుమార్​ బదిలీ విషయంపై మీడియాలో వచ్చిన వివిధ కథనాలను ట్విట్టర్​లో ఖండించింది ఈడీ.

Last Updated : Mar 30, 2019, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details