తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్​ గవర్నర్​పై రాష్ట్రపతి​కి ఈసీ ఫిర్యాదు - మోదీ

రాజస్థాన్​ గవర్నర్​ చిక్కుల్లో పడ్డారు. మోదీకి అనుకూలంగా కల్యాణ్​ సింగ్​ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది.

రాజస్థాన్​ గవర్నర్​పై రాష్ట్రపతి​కి ఈసీ ఫిర్యాదు

By

Published : Apr 3, 2019, 7:51 AM IST

Updated : Apr 3, 2019, 1:08 PM IST

రాజస్థాన్​ గవర్నర్​పై రాష్ట్రపతి​కి ఈసీ ఫిర్యాదు
రాజస్థాన్​ గవర్నర్​ కల్యాణ్​ సింగ్​ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని రాష్ట్రపతికి మంగళవారం ఈసీ లేఖ రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలపై అంతకుముందే ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

మోదీ కోసం కృషి చేయాలి...

మార్చిలో పార్టీ టికెట్​ కోసం పెద్ద సంఖ్యలో భాజపా కార్యకర్తలు కల్యాణ్​ సింగ్​ను సంప్రదించారు. అలీగఢ్​లోని గవర్నర్​ నివాసం ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేయడానికి స్వయంగా కార్యకర్తలకు సర్దిచెప్పారు కల్యాణ్​. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

"మనమందరం భాజపా కార్యకర్తలం. మరోసారి మోదీ ప్రధాని అయ్యే దిశగా కృషి చేయాలి. మోదీ ప్రధాని కావటం అత్యవసరం."
- కల్యాణ్​ సింగ్​, రాజస్థాన్ గవర్నర్​

1990లో హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ ఇలాంటి వివాదాంలోనే చిక్కుకున్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి తన కుమారుడి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు గుల్​షెర్​ అహ్మద్​ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు గవర్నర్​ పదవికి రాజీనామా చేశారు.

Last Updated : Apr 3, 2019, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details