తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో జనవరి 26 తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం( సీఈసీ) పర్యటించనుంది. మరికొన్ని రోజుల్లో వాటి శాసనసభ కాలపరిమితి తీరనున్న తరుణంలో ఎన్నికల కసరత్తును ప్రారంభించనుంది. ఈ విషయాన్ని 11న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా వెల్లడించారు.
బంగాల్, అసోంలో ఇదివరకే పర్యటించింది సునీల్ అరోడా నేతృత్వంలోని బృందం. ఈ రాష్ట్రాలలో వచ్చే మార్చి లేదా ఏప్రిల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.