తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అన్నాడీఎంకే నేత ఇంట్లో ఈసీ తనిఖీలు - ఈసీ

తమిళనాడు మదురైలోని అన్నాడీఎంకే నేత దేవదాస్​ నివాసంలో ఈసీ బృందం సోదాలు చేసింది. గురువారం ఆ రాష్ట్రంలోని 38 లోక్​సభ, 18 శాసనసభ స్థానాలకు పోలింగ్​ జరగనుంది.

అన్నాడీఎంకే నేత ఇంట్లో ఈసీ తనిఖీలు

By

Published : Apr 17, 2019, 4:30 PM IST

తమిళనాట ఎన్నికల సంఘం, ఆదాయ పన్ను శాఖ దాడుల కలకలం కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్​కు కొద్దిగంటల ముందు మదురైలో ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్​ తనిఖీలు చేసింది. అన్నాడీఎంకే నేత దేవదాస్​ ఇంట్లో సోదాలు జరిపింది.

కొద్దివారాలుగా తమిళనాడు, కర్ణాటకలో ఈసీ, ఐటీ శాఖల దాడులు పెరిగిపోయాయి. కేవలం ప్రతిపక్షాలపైనే మోదీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మంగళవారం రాత్రి డీఎంకే నేత కనిమొళి, ఈ ఉదయం ఏఎంఎంకే నేతల ఇళ్లల్లో సోదాలు చేయడం మరింత దుమారం రేపింది. ఇప్పుడు భాజపా మిత్రపక్షం అన్నాడీఎంకే నేత ఇంట్లో ఈసీ బృందం తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అన్నాడీఎంకే నేత ఇంట్లో ఈసీ తనిఖీలు
అన్నాడీఎంకే నేత ఇంట్లో ఈసీ తనిఖీలు

ఇదీ చూడండి: డీఎంకే నేత కనిమొళి నివాసంపై ఐటీ దాడులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details