తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ధర్నా' పోలీస్​ బాస్​లపై బదిలీ వేటు

బంగాల్​లో నలుగురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసింది ఎన్నికల సంఘం. ఈ జాబితాలో కోల్​కతా పోలీసు కమిషనర్​(సీపీ) అనుజ్​ శర్మ, బిదాన్​నగర్​ సీపీ జ్ఞాన్​వంత్​ సింగ్ ఉన్నారు.

ఎన్నికల ముందు పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు

By

Published : Apr 6, 2019, 6:41 AM IST

బంగాల్​లో నలుగురు పోలీసు ఉన్నతాధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఇందులో కోల్​కతా పోలీసు కమిషనర్​(సీపీ) అనుజ్​శర్మ, బిదాన్​నగర్​ సీపీ జ్ఞన్​వంత్​ సింగ్​ తదితరులు ఉన్నారు. ఈ అధికారుల వల్ల ఎన్నికల పారదర్శకతపై ప్రభావం పడుతుందని కొందరు భాజపా నేతలు ఇటీవల అనుమానాలు వ్యక్తం చేశారు.

బదిలీ అయిన అధికారులను ఎలాంటి ఎన్నికల విధుల్లో కొనసాగించకూడదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఈసీ ఆదేశాలు జారీచేసింది.

ధర్నాలో పాల్గొన్న ఇరువురు

శారదా కుంభకోణానికి సంబంధించి అప్పటి కోల్​కతా పోలీసు కమిషనర్ రాజీవ్​ కుమార్​​పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చర్యలు తీసుకోవటంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొన్ని వారాల కిందట ధర్నా చేశారు. ఇందులో అనుజ్​శర్మ, జ్ఞాన్​పంత్​సింగ్​లు పాల్గొన్నారు. దీనిపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి.

విమానాశ్రయంలో మొదలైన వివాదం

తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ అభిషేక్​ బెనర్జీ భార్య రుజిరా కోల్​కతా విమానాశ్రయంలో బంగారంతో దొరికనట్లు ఆరోపణలున్నాయి. బిదాన్​నగర్​ పోలీసు కమిషనర్​ జ్ఞాన్​వంత్​ సింగ్​కు భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనలో పోలీసుల సహాయం చేసినట్లు వస్తున్న ఆరోపణలు నిజమైతే.. జ్ఞాన్​పంత్​ను బాధ్యుడిని చేయాలని భాజపా డిమాండ్​ చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details