తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అసమ్మతి' వెల్లడికి ఈసీ నిరాకరణ

ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆదేశాల్లో అసమ్మతి, మైనార్టీ అభిప్రాయాలను వెల్లడించాలన్న ఎన్నికల కమిషనర్​ అశోక్​ లావాసా డిమాండ్​ను ఈసీ 2-1 మెజారిటీతో తిరస్కరించింది. ఈ అభిప్రాయాలు రికార్డుల్లో ఉంటాయి కానీ ఆదేశాల్లో ఉండవని ఎన్నికల సంఘం పేర్కొంది.

By

Published : May 22, 2019, 5:03 AM IST

Updated : May 22, 2019, 7:23 AM IST

అసమ్మతి వెల్లడికి ఈసీ నిరాకరణ

అసమ్మతి వెల్లడికి ఈసీ నిరాకరణ

ఎన్నికల ప్రవర్తనా నియామావళి ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో అసమ్మతి, మైనార్టీ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. ముగ్గురు సభ్యుల ప్యానెల్​లో ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడా, సుశీల్​ చంద్రలతో పాటు మరో సభ్యుడైన లావాసా ప్రతిపాదనను 2-1 మెజార్టీతో తోసిపుచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో తలెత్తిన సమస్యలపై ఎన్నికల సంఘం మంగళవారం సమావేశమైంది. అసమ్మతి, మైనార్టీ భిన్నాభిప్రాయాలు పోల్​ ప్యానెల్​ రికార్డుల్లో ఉంటాయి కానీ ఆదేశాల్లో ఉండవని పేర్కొంది.

పారదర్శకతే ముఖ్యం: లావాసా

తన ప్రతిపాదన వీగిపోవడంపై ఎన్నికల కమిషనర్​ అశోక్​ లావాసా స్పందించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన సంబంధిత ఆదేశాల్లో ఇప్పటికీ పారతదర్శకతే ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి కేసులను సమయానుకూలంగా పరిష్కరించాలని కోరారు. ఈ విషయంలో తన అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయన్నాయన్నారు లావాసా.

కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు

పలు ఎన్నికల ప్రచార ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షాలకు ఎన్నికల సంఘం క్లీన్​చిట్​ ఇవ్వటంపై లావాసా అసమ్మతి వ్యక్తం చేశారు. ఈసీ ఆదేశాల్లో అసమ్మతి అభిప్రాయాన్నీ వెల్లడించాలని డిమాండ్​ చేశారు.

మోదీ, షాలకు ఈసీ క్లీన్​ చిట్ తర్వాతి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులపై సమావేశాలకు లావాసా దూరంగా ఉంటున్నారు. ఈ అంశంపై ఈ నెల 4న ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడాకు ఆయన లేఖ రాశారు. మైనార్టీ నిర్ణయాలను వెల్లడించేంత వరకూ కమిషన్​ సమావేశాలకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి: ఎన్నికల ప్రచారం తీర్థయాత్రలా అనిపించింది: మోదీ

Last Updated : May 22, 2019, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details