తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని యాత్రలకు ఎన్నికల సంఘం గ్రీన్​ సిగ్నల్​ - election commission

ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథ్​, బద్రీనాథ్​ ఆలయాల సందర్శనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్నికల సంఘం అనుమతించింది. ఎన్నికల కోడ్​ అమలులో ఉందని పీఎంవోకు గుర్తు చేసింది ఈసీ. నేడు, రేపు ప్రధాని పర్యటన సాగనుంది.

ప్రధాని యాత్రలకు ఎన్నికల సంఘం గ్రీన్​ సిగ్నల్​

By

Published : May 18, 2019, 6:25 AM IST

Updated : May 18, 2019, 7:18 AM IST

ప్రధాని యాత్రలకు ఎన్నికల సంఘం గ్రీన్​ సిగ్నల్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల కేదార్​నాథ్​, బద్రినాథ్​ యాత్రలకు ఎన్నికల సంఘం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల చివరి దశ ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని శనివారం ఉత్తరాఖండ్​లోని యాత్రలకు నిర్ణయించారు.

మోదీ రెండు రోజుల పర్యటనకు అనుమతించాలని ప్రధానమంత్రి కార్యాలయం ఈసీని కోరింది. ఇది కేవలం అధికారిక యాత్ర కావడం వల్లే అనుమతించినట్టు ఈసీ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి 10న విధించిన ఎన్నికల కోడ్​ అమలులో ఉందన్న విషయాన్ని పీఎంవోకు గుర్తుచేసినట్టు ఈసీ వెల్లడించింది.

చివరి దశ లోక్​సభ ఎన్నికలు ఈ నెల 19న జరగనున్నాయి. నేడు మోదీ ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథుడి దర్శించుకుని అక్కడి నుంచి రేపు బద్రీనాథ్​కు వెళతారు.

ఇదీ చూడండి:అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మనకేంటి?

Last Updated : May 18, 2019, 7:18 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details