తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ సేన' వ్యాఖ్యలపై నఖ్వీకి ఈసీ మందలింపు

ఎన్నికల ప్రచారంలో భద్రతా బలగాలను 'మోదీ కీ సేన' అనడంపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్​ అబ్బాస్ నఖ్వీని ఎన్నికల సంఘం మందలింపుతో సరిపెట్టింది. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని హెచ్చరించింది. రాజకీయ ప్రచారాల్లో సైన్యాన్ని ప్రస్తావించరాదని తేల్చి చెప్పింది.

'మోదీ సేన' వ్యాఖ్యలపై నఖ్వీకి ఈసీ మందలింపు

By

Published : Apr 18, 2019, 6:25 PM IST

Updated : Apr 19, 2019, 1:04 AM IST

మోదీ సేన వ్యాఖ్యలపై నఖ్వీకి మందలింపు

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి, భాజపా నేత ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీని ఎన్నికల సంఘం మందలించింది. ఉత్తరప్రదేశ్​​ రాంపుర్​లో ఈనె​ల 3న ఎన్నికల ప్రచారంలో నఖ్వీ భారత సైన్యాన్ని ఉద్దేశించి 'మోదీ కీ సేన' అనడంపై ఈసీ షోకాజు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. 'మోదీ కీ సేన' అన్నట్లు నఖ్వీ అంగీకరించారు.

ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కారాదని నఖ్వీని హెచ్చరించింది ఈసీ. భద్రతా బలగాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం నియమాలకు విరుద్ధమని మార్చి 19 నాటి సూచనలను గుర్తు చేసింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఏప్రిల్​ 5న ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​పై 3రోజుల ప్రచార నిషేధం విధించింది ఈసీ.

ఇదీ చూడండి: మోదీ కాన్వాయ్​, హెలికాప్టర్​ తనిఖీ.. ఐఏఎస్​పై వేటు

Last Updated : Apr 19, 2019, 1:04 AM IST

ABOUT THE AUTHOR

...view details