జమ్ముకశ్మీర్ విభజన బిల్లును ఇటీవలే పార్లమెంటు ఆమోదించింది. రాష్ట్రపతి రాజముద్రతో రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మంగళవారం సమావేశమైంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ అనధికారికంగా చర్చించినట్టు సమాచారం.
ఇదీ చూడండి:- 370 రద్దుతో కశ్మీర్లో వచ్చే మార్పులివే...
సీనియర్ అధికారులు జమ్ము విభజన బిల్లుపై ఎన్నికల కమిషనర్, ఇతర సభ్యులకు వివరించినట్టు తెలుస్తోంది. అయితే విభజన చట్టంపై కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘానికి అధికారికంగా లేఖ రాయాల్సి ఉంది. అధికారిక లేఖ అందిన అనంతరం కేంద్ర హోంశాఖ, జమ్ముకశ్మీర్ అధికారులతో చర్చలు జరపనుంది ఈసీ.