ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్నికల సంఘం (ఈసీ) మరోసారి క్లీన్చిట్ ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా మోదీ ప్రసంగించారని అందిన రెండు ఫిర్యాదులను తోసిపుచ్చింది.
ప్రధాని మోదీ ఏప్రిల్ 23న అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రోడ్‌షో నిర్వహించారని.. తద్వారా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ చర్య ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని ఈసీకి ఫిర్యాదు చేసింది.
అహ్మదాబాద్‌లో ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి కొంత దూరం నడిచివెళ్లారు మోదీ. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదును విచారించిన ఈసీ... మోదీకి క్లీన్చిట్ ఇచ్చింది.
ఈసీలో భిన్నాభిప్రాయాలు
ఏప్రిల్ 9న కర్ణాటక చిత్రదుర్గలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... తొలిసారి ఓటు హక్కు పొందిన ఓటర్లు బాలాకోట్ వైమానిక దాడి చేసిన హీరోలకు ఓటు వేయాలని సూచించారు. అదే రోజు మహారాష్ట్ర లాతూర్‌లోని ఔషాలోనూ ఇదే విజ్ఞాపన చేశారు. ఈ విషయంలోనూ ప్రధాని మోదీకి ఈసీ క్లీన్చిట్ ఇచ్చింది ఈసీ.