తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని మోదీకి మరోసారి ఈసీ క్లీన్​ చిట్​ - క్లీన్​చిట్

ప్రధాని నరేంద్ర మోదీ పై వచ్చిన మరో రెండు ఎన్నికల కోడ్​ ఉల్లంఘన ఫిర్యాదులపై  ఎన్నికల సంఘం క్లీన్​ చిట్​ ఇచ్చింది. వారణాసిలో సైనిక దళాల గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రావని స్పష్టం చేసింది.

ప్రధాని మోదీకి మరోసారి ఈసీ క్లీన్​ చిట్​

By

Published : May 4, 2019, 6:28 AM IST

ప్రధాని మోదీకి మరోసారి ఈసీ క్లీన్​ చిట్​

వారణాసి, మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలలో ఎన్నికల కోడ్​ ఉల్లంఘించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటివరకు మోదీపై వచ్చిన 5 ఫిర్యాదులపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అన్నింటిలోనూ మోదీకి సచ్ఛీలత పత్రమిచ్చింది ఈసీ.

మహారాష్ట్రలో...

ఏప్రిల్​ 6న మహారాష్ట్ర నాందేడ్​లో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్​ను మునిగిపోతోన్న టైటానిక్​ నావగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ ఈసీని ఆశ్రయించింది.

వారణాసిలో...

తాను పోటీ చేస్తోన్న వారణాసి లోక్​సభ స్థానంలో ఏప్రిల్​ 25న ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. జాతీయ భద్రత, తీవ్రవాదం, బాలాకోట్​ వైమానిక దాడులను ప్రస్తావిస్తూ భాజపా ఉగ్రవాదానికి సరైన బదులిచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

ఈ రెండు ప్రసంగాలపై నివేదికలు తెప్పించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం మోదీకి క్లీన్​ చిట్​ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

ABOUT THE AUTHOR

...view details