రాజ్యసభ ఉప ఎన్నికల తేదీపై ప్రకటన చేసింది భారత ఎన్నికల సంఘం. ఆరు ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికల కోసం ఈ నెల 18 నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపింది. జులై 5న ఎన్నికలు... అదే రోజున ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది ఈసీ. ఇందులో లోక్సభకు ఎన్నికైన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్థానమూ ఉంది.
పార్లమెంట్లోని అన్ని సభల్లో ఏర్పడిన ఖాళీలను ప్రత్యేక ఖాళీలుగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది ఈసీ. వీటికి ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ చేసి, ప్రత్యేక ఎన్నికలు నిర్వహిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు 1994, 2009లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన రెండు తీర్పులను ఉదహరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం నియమాల ప్రకారం ఒకే రాష్ట్రంలో వేరు వేరుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈ తీర్పులు మద్దతు తెలుపుతున్నాయని పేర్కొంది.
కాంగ్రెస్ డిమాండ్..