స్నేహితులు సరదాగా ముచ్చటించడానికి ఛాయ్‌ను ఆశ్రయిస్తారు. నెమ్మదిగా గుటకలేస్తూ తాపీగా చర్చిస్తారు. మొత్తంగా చూస్తే ఒక కప్పు తాగి కనీసం అరగంటైనా కాలక్షేపం చేస్తారు. కానీ.. నిమిషాల వ్యవధిలో కప్పుల కొద్దీ టీని స్వాహా చేస్తున్నాడు మహారాష్ట్ర పుణెకు చెందిన సచిన్ శిందే.
సచిన్ రికార్డ్... 9 నిమిషాల్లో 45 కప్పుల టీ స్వాహా - sachin shinde in maharastra
మహారాష్ట్ర పుణెలో టీ తాగడంలో రికార్డు సృష్టిస్తున్నాడు సచిన్ శిందే. 9 నిమిషాల్లో 45 కప్పుల ఛాయ్ స్వాహా చేసి ఆశ్చర్యపరిచాడు.
సచిన్ రికార్డ్
పుణెలో సచిన్ రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఛాయ్ తాగడంలో రికార్డులు తిరగరాస్తున్న సచిన్‌తో అతని స్నేహితుడు రూ.1000 పందెం కాశాడు. ఒక పాత్రలో 45 కప్పుల టీ పోసి 20 నిమిషాల్లో తాగాలని షరతు పెట్టాడు. అయితే ఆ మొత్తాన్ని 9 నిమిషాల్లోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు సచిన్.
ఇదీ చూడండి: బతికున్న వ్యక్తికి శవయాత్ర- కారణం అద్భుతం!
Last Updated : Sep 30, 2019, 8:38 PM IST