ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, కరెన్సీ నోట్లు, పత్రాలను శానిటైజ్ చేసేందుకు ఆటోమేటిక్, కాంటాక్ట్‌లెస్ యూవీ శానిటైజర్‌ను సిద్ధం చేసింది హైదారాబాద్‌లోని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ). ఈ శానిటైజర్‌కు డీఆర్‌యూవీఎస్(అల్ట్రావైలెట్ శానిటైజర్) అని పేరు పెట్టింది.
ఇక కరెన్సీ నోట్లు, ఫోన్లకూ శానిటైజేషన్
కరోనా వైరస్ భయంతో బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ శానిటైజర్లతో చేతులు తెగ కడిగేస్తున్నారు. కానీ మీరు ఉపయోగించే ఫోన్ వంటి వాటితోనూ ప్రమాదమే. అందుకే వీటిని శానిటైజ్ చేసేందుకు అటోమేటిక్, కాంటాక్ట్‌లెస్ యూవీ శాటిటైజర్ను అభివృద్ధి చేసింది డీఆర్డీఓ. హైదరాబాద్‌లోని ల్యాబ్‌లో ఈ యంత్రాన్ని అభివృద్ధి చేసింది.
ఫోన్ శానిటైజేషన్ కోసం సరికొత్త వ్యవస్థ
ఈ శానిటైజర్ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఇందులోని క్యాబినెట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, కరెన్సీ నోట్లు పెడితే... యూవీ కిరణాలు వాటిని శానిటైజ్ చేస్తాయి. ప్రక్రియ పూర్తయ్యాక యంత్రం స్లీప్ మోడ్‌లోకి జారుకుంటుంది. ఈ విధంగా క్యాబినెట్ వద్ద ఎవరూ ఉండనవసరం లేదని డీఆర్డీఓ తెలిపింది.
ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్స్, కరెన్సీ నోట్లు, పాస్‌బుక్‌లు, పత్రాలు తదితర వాటిని ఈ పద్ధతి ద్వారా శానిటైజ్ చేయవచ్చని పేర్కొంది డీఆర్డీఓ.