తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టోఫెల్ రాయకుండానే బ్రిటన్​ వెళ్లొచ్చు! - britan

టోఫెల్, ఐఈఎల్​టీఎస్ పరీక్షలను క్లియర్​ చేయకుండానే తమ దేశానికి ఆహ్వానిస్తోంది బ్రిటన్. మంచి అవకాశమే అయినప్పటికీ షరతులు వర్తిస్తాయి. ఆక్యుపేషనల్ ఇంగ్లీషు టెస్టును పూర్తిచేసిన వైద్యులు, నర్సులు, దంతవైద్యులు, మంత్రసానులు తమ దేశంలో పనిచేయవచ్చంటూ నిబంధనలను సడలించింది.

టోఫెల్ లేకుండానే బ్రిటన్​కు వెళ్లొచ్చు!

By

Published : Sep 22, 2019, 8:38 PM IST

Updated : Oct 1, 2019, 3:17 PM IST

విదేశాలకు వెళ్లాలంటే.. టోఫెల్, ఐఈఎల్​టీఎస్ పరీక్షలను క్లియర్​ చేయాలి అని ఠక్కున వచ్చే సమాధానం. అమీర్​పేట, దిల్​సుఖ్​నగర్ ప్రాంతాలకు వెళ్తే చాలు.. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన సంస్థలూ అనేకం. ఎంతో ఏకాగ్రత, పట్టుదలతో చదివితే కానీ నెగ్గని కల. ఇవేవీ లేకుండానే బ్రిటన్​కు వెళ్లాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకేనండి. కానీ ఒక్క షరతు. మీరు వైద్య వృత్తికి సంబంధించినవారై ఉండాలి.

వైద్యులు, నర్సులు, దంతవైద్యులు, మంత్రసానులు ఎలాంటి అర్హత పరీక్షల్లో నెగ్గకుండానే తమ దేశంలో పనిచేసే అవకాశం కల్పిస్తోంది బ్రిటన్. మీరు చేయాల్సిందల్లా ఆక్యుపేషనల్ ఇంగ్లీష్​ టెస్ట్(ఓఈటీ) పాస్​ కావడం, వైద్య రంగానికి చెందిన సంస్థ వద్ద ఆయా వృత్తిలో నమోదై ఉండటమే.

ఏంటీ ఓఈటీ?

అంతర్జాతీయ ఆంగ్ల భాషా పరీక్ష అయిన ఓఈటీ వైద్యరంగానికి అవసరమైన భాషా పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. ఆంగ్ల వాతావరణంలో పనిచేయాలని అనుకునే వారికి ఉద్దేశించిన పరీక్ష ఇది. ఈ టెస్టును కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ విభాగమైన కేంబ్రిడ్జి బాక్స్​హిల్ లాంగ్వేజ్​ అసెస్​మెంట్(సీబీఎల్​ఏ) నిర్వహిస్తుంది. ఈ పరీక్షను క్లియర్ చేయడం ద్వారా బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయి, సింగపూర్ వంటి దేశాల్లో పనిచేసేందుకు వీలు కల్పిస్తోంది.

ఇంతకుముందు నర్సు, మంత్రసానిగా నమోదు చేసుకునేందుకు ఓఈటీ వద్ద రిజిస్ట్రర్ చేసుకోవడమే కాక టోఫెల్, ఐఈఎల్​టీఎస్ పరీక్షలను క్లియర్ చేయాల్సి వచ్చేది.

"ఇప్పటికే ఓ నైపుణ్య సంస్థలో భాషా పరీక్షను పూర్తిచేసిన డాక్టర్లు, దంతవైద్యులు, నర్సులు, మంత్రసానులు టైర్​-2 వీసా ద్వారా బ్రిటన్​కు వెళ్లేందుకు మరొక టెస్టును క్లియర్​ చేయాల్సిన అవసరం లేదని బ్రిటన్​ అంతర్గత కార్యాలయం తెలిపింది."

-సుజాత స్టెడ్, సీఈఓ, కేంబ్రిడ్జ్​ బాక్స్​హిల్ లాంగ్వేజ్ అసెస్​మెంట్.

గతవారం ప్రకటించిన ఈ మార్పు వల్ల ఆసుపత్రులు, మెడికల్ ప్రాక్టీసు చేస్తున్నవారు త్వరగా బ్రిటన్​కు వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆమె స్పష్టం చేశారు.
అక్టోబర్​ 1నుంచి టైర్​-2 వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ అవకాశం ఉండనుంది.

ఇదీ చూడండి: చలిని జయించేందుకు సీఆర్​పీఎఫ్​కు కొత్త అస్త్రాలు!

Last Updated : Oct 1, 2019, 3:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details