తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"కాగితాలు కాపాడలేని చౌకీదార్​ అవసరమా?"

భాజపా చౌకీదార్​ ప్రచారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రఫేల్​ పత్రాలు కాపాడలేని చౌకీదార్​ దేశానికి అవసరమా అని ప్రశ్నించారు. ఓట్ల కోసమే నిరుద్యోగ సమస్యను కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు మాయావతి.

బీఎస్పీ అధినేత్రి మాయావతి

By

Published : Mar 22, 2019, 2:06 PM IST

భాజపా చౌకీదార్​ ప్రచారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అగ్రనేతలు తమను తాము చౌకీదార్లుగా ప్రకటించుకోవడంపై ట్విట్టర్​ వేదికగా నిప్పులు చెరిగారు మాయావతి.

రఫేల్​ పత్రాలు పోయాయన్న బాధ లేని కాపలాదారు దేశానికి అవసరమా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో నిరుద్యోగ సమస్యను ఎన్నికల్లో ఓట్ల కోసమే భాజపా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

"భాజపా నాయకులు వారికి ఇష్టమొచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. అయితే ఆ ప్రక్రియలో రాజ్యాంగ పదవులను ఏ రకంగానూ అవమానించకూడదు. రఫేల్​ పత్రాలు మాయమైతే వీరికి ఎలాంటి బాధ లేదు. నిరుద్యోగం, రైతు సమస్యలు వంటి వివరాలు బయటకు రాకుండా మాత్రం జాగ్రత్త పడతారు." - మాయావతి, బీఎస్పీ అధినేత్రి

ప్రధానితో సహా భాజపా నాయకులు పేర్ల ముందు చౌకీదార్​ పెట్టుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్​ మాత్రం చౌకీదార్​ పదం తగిలించుకోలేదని మాయావతి గుర్తుచేశారు. చౌకీదార్​గా ఉండాలో, ప్రజా సేవకుడిగా ఉండాలో లేక యోగిగా మిగలాలో తెలియని సందిగ్ధంలో యూపీ సీఎం ఉన్నారని మాయావతి ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details